నిరుద్యోగం తీవ్రంగా పెరుగుతోన్న తరుణంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కీలక ప్రకటన చేశారు. స్థానిక యువత కోసం వివిధ శాఖల్లో ఉన్న 25,000 ఖాళీ పోస్టులను పూర్తి చేస్తామని తెలిపారు.
10,000 పోస్టుల నోటిఫికేషన్ కోసం దాదాపు ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, త్వరలోనే వారికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. మోదీ హామీ ఇచ్చినట్టుగా కశ్మీర్ యువతకు 50 వేల ఉద్యోగాలు కల్పించి తీరుతామని స్పష్టంచేశారు. ఆర్మీ, పారామిలిటరీ, జమ్ము కశ్మీర్ పోలీసు రిక్రూట్మెంట్ ర్యాలీలు త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు.