కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి నివాళులర్పించేందుకు భాజపా నేతలు భారీగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషాల సమయంలో జైట్లీ పార్థివదేహాన్ని దిల్లీ ఎయిమ్స్ నుంచి కైలాష్ కాలనీలో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, నేతలు జైట్లీకి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
జైట్లీ నివాసానికి పార్థివదేహం.. నేతల నివాళులు అంతకముందు దిల్లీ ఎయిమ్స్‌లో జైట్లీ పార్థివ దేహానికి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా తరఫున కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్, జేపీ నడ్డా పుష్పాంజలి ఘటించారు.
మోదీ తరఫున రాజ్‌నాథ్..
కార్యకర్తలు, అభిమానుల సందర్శన కోసం జైట్లీ పార్థివ దేహాన్ని రేపు ఉదయం 11 గంటలకు భాజపా కార్యాలయానికి తరలిస్తారు. మధ్యాహ్నం నిగమ్‌బోధ్‌ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నందున మోదీ తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. జైట్లీ అంత్యక్రియల్లో పాల్గొంటారు.
ఫలించని వైద్యుల ప్రయత్నాలు
కొద్ది రోజులుగా గుండె, మూత్రపిండం సమస్యలతో బాధపడుతున్న జైట్లీ ఈనెల 9వ తేదీ నుంచి దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. దాదాపు 15 రోజులపాటు నిర్విరామంగా శ్రమించినప్పటికీ వైద్యుల ప్రయత్నాలు సఫలం కాలేదు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాలకుజైట్లీ తుదిశ్వాస విడిచారు.