కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ఆదివారం దిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో జరగనున్నాయి. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ... శనివారం 12 గంటల 7 నిమిషాలకు కన్నుమూశారు.
66 ఏళ్ల జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి కైలాశ్ కాలనీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పార్థివదేహాన్ని దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. భాజపా సహా వివిధ పార్టీల నేతలు, అభిమానులు జైట్లీని కడసారి చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.