తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అసత్యాలతోనే విపక్షాల ప్రచారం'

అసత్యాల  ప్రచారంలో విపక్షాలది అందె వేసిన చేయి అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. రఫేల్ ఒప్పందం, నీరవ్​ మోదీ రుణాల ఎగవేత, వైమానిక దాడులపై అనుమానాలు తప్పితే రాహుల్ ప్రసంగాల్లో మరేమీ ఉండవని ఎద్దేవా చేశారు.

అసత్యాలతోనే విపక్షాల ప్రచారం

By

Published : Mar 17, 2019, 9:10 AM IST

అసత్యాలతోనే విపక్షాల ప్రచారం: అరుణ్​ జైట్లీ
అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​జైట్లీ. అబద్ధపు ఆరోపణలు చేయటంలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ​ దిట్ట అని ఎద్దేవా చేశారు. రాహుల్ ప్రసంగాల్లో రఫేల్, నీరవ్ మోదీ, వైమానిక దాడులపై అనుమానాలు తప్పితే నిర్మాణాత్మక అంశమేదీ ఉండదని 'అజెండా-2019' బ్లాగ్​లో ప్రస్తావించారు జైట్లీ.

"రాహుల్ గాంధీ ప్రసంగాల్లో అసత్య ఆరోపణల్ని పక్కనపెడితే ఇక ఏమీ ఉండదు. విపక్షాలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కట్టుకథలు అల్లుతున్నాయి. ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నాయి. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు.

మోదీ ఐదేళ్ల పాలనలో ఎలాంటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోలేదు. ఆయన హయాంలో ఓటర్లు సంతృప్తికరంగా ఉన్నారు. అధికారాన్ని దక్కించుకునేందుకు మోదీని విపక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. కాంగ్రెస్ హయాంలోనే నీరవ్ మోదీ ఎదిగారు. 2011లోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్​ను కొల్లగొట్టడం ప్రారంభించారు. లిక్కర్​ కింగ్ విజయ్​ మాల్యాకు సైతం యూపీఏ జమానాలోనే రుణాలు మంజూరయ్యాయి."

-అరుణ్ ​జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

ABOUT THE AUTHOR

...view details