రక్షణ రంగ బలోపేతమే ప్రభుత్వ ప్రాథమ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దిల్లీ వేదికగా జరిగిన వ్యాపార సదస్సులో జైట్లీ పలు విషయాలపై ప్రసంగించారు. రక్షణ రంగంలోని లోటుపాట్లను పూడ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు.
భద్రత అనంతరం గ్రామీణాభివృద్ధి, మెరుగైన ఆరోగ్య వసతుల కల్పన, విద్యా వ్యవస్థల సంస్కరణలపై పాటుపడుతామని వివరించారు. పన్ను రేట్లను తగ్గిస్తేనే వసూళ్లలో పురోగతి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా ప్రత్యక్ష, పరోక్ష పన్నులు తగ్గిస్తూ వస్తున్నామన్నారు.