తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"కాంగ్రెస్​, జేడీఎస్​ల తీరు అనుమానాలకు తావిస్తోంది" - bengaluru

కర్ణాటకలో ఐటీ శాఖ సోదాలపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బెంగళూరులోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం ముందు కాంగ్రెస్​, జేడీఎస్ శ్రేణులు​ ఆందోళన చేపట్టడంపై తీవ్రంగా స్పందించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. ఐటీ సోదాలపై ఇరు పార్టీల తీరు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. నిరసనలు ఎందుకు చేపట్టారో సమాధానమివ్వాలని ప్రశ్నించారు.

కాంగ్రెస్​, జేడీఎస్​ల తీరు అనుమానాలకు తావిస్తోంది

By

Published : Mar 30, 2019, 9:10 PM IST

ఆదాయ పన్ను శాఖ దాడులపై కర్ణాటకలో రాజకీయ రగడ కొనసాగుతోంది. కాంగ్రెస్​, జేడీఎస్​ నాయకులు బెంగళూరులోని ఐటీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టడాన్ని తప్పుపట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​జైట్లీ. ట్విట్టర్​ వేదికగా ఇరు పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అరుణ్​జైట్లీ ట్వీట్​

"కాంగ్రెస్​, జేడీఎస్​ పార్టీలు ఐటీ దాడులపై స్పందిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. మంత్రి మేనల్లుడేమైన పీడబ్ల్యూడీ కాంట్రాక్టరా.. ఆయనకే అధిక ప్రాధాన్యమిచ్చారు. దీనికి బంధు ప్రీతే కారణమా.. ఆందోళనల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి, మంత్రులు ఈ ప్రశ్నకు సమాధానమివ్వాలి."- అరుణ్​ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

ఆందోళనల్లో ముఖ్యమంత్రి పాల్గొనటం ఎప్పుడూ జరగలేదన్నారు జైట్లీ. రాష్ట్ర మంత్రుల ఇళ్లలో సోదాలు చేపట్టారని చెబుతున్న పార్టీలు... మంత్రి మేనల్లుడిని సాక్ష్యంగా చూపుతున్నారని చెప్పారు. కానీ ఏ ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రులపై సోదాలు చేపట్టలేదని ఐటీ శాఖ అధికారులు ప్రకటించారని గుర్తుచేశారు. నిరసనలు ఎందుకు చేశారో చెప్పాలన్నారు.

కేంద్ర బలగాలు అందుకే

ఆదాయపన్ను శాఖ అధికారులకు రక్షణగా చాలా రాష్ట్రాలు పోలీసులను పంపటం లేదన్నారు జైట్లీ. పోలీసులను రక్షణ కోసం అడిగితే, దాడుల సమాచారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగానే తెలిసిపోతోందని అన్నారు. చివరికి దాడులు జరిగే వారికీ ముందస్తు సమాచారమందుతోందని చెప్పారు. అందుకే ఐటీ అధికారులు కేంద్ర బలగాలపై ఎక్కువగా ఆధారాపడుతున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details