తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తూర్పు భారతంలో ఆశ్చర్యకర ఫలితాలు' - javadekar

ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్, ఒడిశాలో ఆశ్చర్యకర ఫలితాలు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ జోస్యం చెప్పారు. రెండు దశల పోలింగ్​ను గమనిస్తే ప్రధాని నరేంద్రమోదీ వైపే ఓటర్లు ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. 300 సీట్లలో భాజపా విజయం ఖాయమని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

భాజపా విజయంపై జైట్లీ ధీమా

By

Published : Apr 19, 2019, 8:20 AM IST

Updated : Apr 19, 2019, 4:06 PM IST

భాజపా విజయంపై జైట్లీ ధీమా

తూర్పు భారతంలో ప్రధాని నరేంద్రమోదీ వైపే ఓటర్లు మొగ్గు చూపుతారని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్​, ఒడిశాలో రెండు దశల పోలింగ్​ను గమనించానని, ఆశ్చర్యకర ఫలితాలు ఖాయమని జోస్యం చెప్పారు జైట్లీ.

"మొదటి రెండు దశల పోలింగ్​ను చూస్తే మోదీ, ఎన్డీయే వైపే ఓటర్లు ఉన్నట్టు అవగతమవుతోంది. ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్, ఒడిశా... లోక్​సభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు ఖాయం."
-అరుణ్ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

300 తథ్యం

300 లోక్​సభ స్థానాల్లో భాజపా కచ్చితంగా విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి జావడేకర్​ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే విపక్షాలు ఓటమికి పూర్తి సిద్ధంగా ఉన్నాయని చురకలంటించారు.

"రెండు దశల పోలింగ్​ను గమనిస్తే భాజపాకు అనుకూలంగానే కనిపిస్తోంది. భాజపా 300 స్థానాల్లో గెలుస్తుందనే సంకేతాలు బలంగా ఉన్నాయి. బంగాల్​లో జరిగిన హింసాత్మక ఘటనలే ఇందుకు నిదర్శనం. క్షేత్రస్థాయిలో భాజపా బలంగా ఉండటం వల్ల విపక్షాలు ఇలా ప్రవర్తిస్తున్నాయి.మొదటి దశ పోలింగ్​ తర్వాత దిల్లీలో విపక్షాల నేతలు సమావేశమయ్యారు. ఓటమికి వాళ్లు సిద్ధమై ఉన్నారు."

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర మంత్రి

ఇదీ చూడండి: 'చౌకీదార్​ చోర్​హై' ప్రచార వీడియోపై ఈసీ నిషేధం

Last Updated : Apr 19, 2019, 4:06 PM IST

ABOUT THE AUTHOR

...view details