కర్ణాటకలో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటకలోని మండ్య జిల్లా పరిషత్ అధ్యక్షుడు, జేడీఎస్ నేత నాగరత్న స్వామికి చెందిన రెండు ప్రదేశాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జడ్పీ సభ్యుడైన ఆదే పార్టీకి చెందిన మరో నాయకుడి ఇంట్లోనూ తనిఖీలు చేస్తున్నారు.
జేడీఎస్ నేతల నివాసాలపై ఐటీ దాడులు - mandya
కర్ణాటకలో జేడీఎస్ నేతల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మండ్య జిల్లా పరిషత్ అధ్యక్షుడు నాగరత్న స్వామితో పాటు మరో నాయకుడి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు.
జేడీఎస్ నేతల నివాసాలపై ఐటీ దాడులు
మండ్య లోక్‌సభ స్థానం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ. నటి సుమలత నిఖిల్‌కు ప్రత్యర్థి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలతకు భాజపా మద్దతిస్తోంది.
కక్షపూరితంగా కేంద్రంపై తమ పార్టీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తోందని ఇటీవలే సీఎం కుమారస్వామి ధర్నాకు దిగారు. ఈ అంశంపై జేడీఎస్-కాంగ్రెస్, భాజపా నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది.
Last Updated : Apr 16, 2019, 3:27 PM IST