తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రఫేల్' పుస్తకం విడుదలపై హైడ్రామా! - ఎన్నికల సంఘం

తమిళనాడులో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఓ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం అత్యుత్సాహంతో 'రఫేల్'​పై హైడ్రామా నడిచింది. ప్రముఖ రచయిత ఎస్​.విజయన్ రాసిన​ 'రఫేల్​: ద స్కామ్​ దట్​ రాక్​డ్​ ది నేషన్​' పుస్తకం విడుదల కార్యక్రమం మంగళవారం జరిగింది. తొలుత ఈ కార్యక్రమాన్ని ఎన్నికల విధుల్లో ఉన్న ఫ్లయింగ్​ స్క్వాడ్​ అడ్డుకుంది. పుస్తకాలు స్వాధీనం చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాలతో పుస్తకం విడుదలకు తిరిగి అనుమతిచ్చింది.

'రఫేల్' పుస్తకం విడుదల నేపథ్యంలో హైడ్రామా!

By

Published : Apr 3, 2019, 10:59 AM IST

ప్రముఖ రచయిత ఎస్​ విజయన్​ రచించిన 'రఫేల్​: ద స్కామ్​ దట్​ రాకడ్​ ది నేషన్​' పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా హైడ్రామా చోటు చేసుకుంది. ఈ వేడుక నిర్వహించొద్దని ఎన్నికల ఫ్లయింగ్​ స్వ్కాడ్​ అడ్డుకుంది. మంగళవారం ఉదయం దాదాపు 150 పుస్తకాలను జప్తు చేసింది. అనంతరం చెన్నైలో జరగాల్సిన పుస్తకావిష్కరణ వేడుకను నిషేధించింది. పుస్తకం ప్రచురణతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నందుకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది.

ఇదంతా జరిగిన కొద్ది గంటలకే తమ నిర్ణయాన్ని మార్చుకుంది ఫ్లయింగ్​ స్క్వాడ్. జప్తు చేసిన పుస్తకాలను వెంటనే తిరిగి అప్పగించి, పుస్తకావిష్కరణ వేడుకకు అనుమతినిచ్చారు అధికారులు. అనుకున్న సమయానికి వేడుక జరిగింది.

ఎన్నికల సంఘం ఈ పుస్తకం విడుదలను అడ్డుకునేందుకు ఆదేశాలివ్వలేదని స్పష్టం చేసింది. దీనిపై విచారణ చేపట్టినట్టు వెల్లడించింది.

ఒక పార్టీకి సహకరించడం కోసమే...

పుస్తకావిష్కరణ వేడుకకు ముఖ్య అథిగా హాజరైన ప్రముఖ పాత్రికేయుడు, హిందు గ్రూప్​ ఆఫ్​ పబ్లికేషన్స్​ బోర్డు సభ్యుడు రామ్​... పుస్తకాలను జప్తు చేయడాన్ని తప్పుపట్టారు. కొంతమంది అధికారులు పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపించారు.

'రఫేల్' పుస్తకం విడుదలపై హైడ్రామా!

"ఇవాళ జరిగింది పూర్తిగా అత్యుత్సాహంతో వ్యవహరించిన అధికారుల పక్షపాతం వల్లే. ఇది అప్రజాస్వామికం. ముందు ఎన్నికల ఫ్లయింగ్​ స్క్వాడ్​ సభ్యులు వేడుకలో పాల్గొనే వారికి ఫోన్​ చేసి బెదిరించారు. అనంతరం షో రూమ్​లోని 150 పుస్తకాలను జప్తు చేశారు. ఎన్నికల నియమావళి పేరుతో పక్షపాతం చూపిస్తున్నారు. ఒక పార్టీకి సహకరిస్తున్నారు. ఏ నిబంధనల ప్రకారం వారు ఇలా ప్రవర్తించగలరు? ఇలాంటి ప్రజాస్వామ్య విరుద్ధ సంఘటనలు మరోసారి జరగకూడదు. ఎన్నికల సంఘం దీనిపై దృష్టిపెట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా."
-రామ్​, ప్రముఖ పాత్రికేయుడు

ఈ వివాదంపై భారతీ పబ్లికేషన్స్​ ఎడిటర్​ రాజన్​ స్పందించారు. తమకున్న పరిధిని దృష్టిలో పెట్టుకునే పుస్తకాన్ని రూపొందించినట్టు స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించామని, కానీ ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం ఇదే తొలిసారని అన్నారు. ఎప్పుడూ లేనిది ఈసారి ఎన్నికల సంఘం, ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం తెలిపాయని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details