అంతరిక్ష పరిస్థితులపై అవగాహన, ఖగోళ భౌతిక శాస్త్ర అంశాలపై సహకారం కోసం భారత 'అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)' కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 'ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్(ఏఆర్ఐఈఎస్)'తో పరస్పర ఒప్పందం కుదుర్చుకుంది.
అభివృద్ధి పథంలో 'ఇస్రో' కీలక ఒప్పందం
అంతరిక్ష పరిస్థితులపై సమగ్ర అవగాహన కోసం.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఆర్ఐఈఎస్తో ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించింది.
అభివృద్ధి పథంలో ఇస్రో కీలక ఒప్పందం
ఉత్తరాఖండ్- నైనిటాల్లో ఈ నెల 4న జరిగిన వీడియో సమావేశంలో ఇరు సంస్థలూ పాల్గొన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా.. ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ ఆర్ ఉమా మహేశ్వరన్, ఏఆర్ఐఈఎస్ డైరెక్టర్ దీపాంకర్ బెనర్జీలు సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. ఈ రెండు సంస్థల పరస్పర సహకారంతో రానున్న కాలంలో ఆర్బిటాల్ ట్రాకింగ్, వాతావరణ అధ్యయనా అంశాలపై కచ్చితమైన అవగాహన వస్తుందని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇదీ చదవండి:'మట్టి'ని తయారు చేసిన ఇస్రో.. పేటెంట్ హక్కు సొంతం