తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్లిక్​ క్లిక్​: చంద్రయాన్​-2 కెమెరాతో భూమి ఫొటోలు - భూమి

'చంద్రయాన్-2'  అంతరిక్షంలో నుంచి భూమిని ఫోటోలు తీసి పంపింది. ఈ చిత్రాలను ఇస్రో తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకుంది.

క్లిక్​ క్లిక్​: చంద్రయాన్​-2 కెమెరాతో భూమి ఫొటోలు

By

Published : Aug 4, 2019, 3:33 PM IST

చంద్రయాన్​-2 బంధించిన భూమి ఛాయాచిత్రాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో నేడు ట్విట్టర్​లో పంచుకుంది. రెండు వారాల క్రితం నింగికేగిన చంద్రయాన్‌-2లో ఉన్న ఎల్‌ 14 కెమెరా ఈ చిత్రాలను తీసినట్లు ఇస్రో తెలిపింది. ఈ చిత్రాల్లో భూమి వివిధ కోణాల్లో కనిపించింది.

భూమి ఛాయాచిత్రం
చంద్రయాన్​-2 తీసిన ఫొటో
ఎల్​ 14 కెమెరా క్లిక్​మనిపించిన ఫొటో
అంతరిక్షంలో నుంచి చంద్రయాన్​-2 తీసిన చిత్రం
భూమిని వివిధ కోణాల్లో ఫొటో తీసిన చంద్రయాన్​-2

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతమైన తర్వాత సామాజిక మాధ్యమాల్లో పలు చిత్రాలు దర్శనమిచ్చాయి. ఇవన్నీ చంద్రయాన్​-2 తీసిన చిత్రాలని వార్తలు వినిపించాయి. అయితే ఇస్రో వీటిని ఖండించింది. నేడు చంద్రయాన్​-2 తీసిన భూమి ఫోటోలను తన ట్విట్టర్​ ఖాతాలో పంచుకుంది.

ఎవరూ అందుకోని..

చంద్రయాన్​-2 ఇప్పటివరకు ఏ దేశం అడుగుపెట్టని జాబిల్లి దక్షిణ ధ్రువంపై కాలుమోపనుంది. చంద్రయాన్​-1ను ప్రయోగించిన 11 ఏళ్ల తర్వాత.. ఇస్రో 2019 జులై 22న విజయవంతంగా చంద్రయాన్​-2ను నింగికి పంపింది.

ABOUT THE AUTHOR

...view details