తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​పై ఆశలు గల్లంతు' - వైఫల్యం

చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​తో సంబంధాలు పునరుద్ధరించడం అత్యంత కష్టమని ఇస్రో సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. విక్రమ్, ప్రజ్ఞాన్​పై ఆశలు వదులుకున్నట్లేనని వివరించారు.

'చంద్రయాన్​-2 ల్యాండర్​, రోవర్​పై ఆశలు గల్లంతు'

By

Published : Sep 7, 2019, 8:34 AM IST

Updated : Sep 29, 2019, 6:01 PM IST

చంద్రయాన్-2 ల్యాండర్​తో సంబంధాల పునరుద్ధరణ అంత తేలిక కాదని చెప్పారు ఇస్రో సీనియర్ అధికారి ఒకరు. విక్రమ్, ప్రజ్ఞాన్​ను మనం కోల్పోయినట్లేనని పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.

"ల్యాండర్​తో ఎలాంటి కమ్యూనికేషన్​ లేదు. మనం ల్యాండర్​ను కోల్పోయినట్లే. తిరిగి దక్కుతుందన్న ఆశ లేదు. ల్యాండర్​, ఇస్రో మధ్య సంబంధాల పునరుద్ధరణ చాలాచాలా కష్టం."

-ఇస్రో సీనియర్ అధికారి

జులై 22న మొదలైన చంద్రయాన్​-2 ప్రయాణం... ఆఖరి నిమిషంలో అనూహ్య మలుపు తిరిగింది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఇస్రోతో ల్యాండర్​కు సంబంధం తెగిపోయింది. పూర్తి డేటాను విశ్లేషించి, ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని ఇస్రో తెలిపింది.

Last Updated : Sep 29, 2019, 6:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details