తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు మూడు రోజుల్లో ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు - భారత వాతావరణ విభాగం

దేశంలో కొద్దిరోజులుగా ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది భారత వాతావరణ విభాగం.

Isolated very heavy rainfall very likely over Odisha during 24th-26th Aug: IMD
మరో రెండు మూడు రోజుల్లో అయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు

By

Published : Aug 22, 2020, 3:57 PM IST

ఒడిశాలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. ఈ నెల 24 నుంచి 26 మధ్య కాలంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అభిప్రాయపడింది. ఈ ప్రభావంతో ఆగస్టు 25, 26 తేదీల్లో బంగాల్​లో.. 26న ఝార్ఖండ్​లోని పలుచోట్ల భారీ వానలు కురిసే అవకాశముందని ఐఎండీ పేర్కొంది.

ఈ మేరకు రానున్న 24 గంటల్లో దక్షిణ రాజస్థాన్​, బిహార్​, పశ్చిమ మధ్యప్రదేశ్​, బంగాల్​, ఝార్ఖండ్​లో పిడుగుపాటులు సంభవించే అవకాశముందని వెల్లడించింది.

పెరిగిన యమునా నది నీటిమట్టం

కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా దిల్లీ యమునా నదిలో నీటి మట్టం పెరిగింది.

యమునా నదిలో పెరిగిన నీటి మట్టం
యమునా నది

ఇప్పటికే భారీ వర్షాల ధాటికి గుజరాత్​, మహారాష్ట్ర, బిహార్​, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, అసోం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మధ్యప్రదేశ్​లోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన ఈ వరదలు.. సాధారణ జన జీవనంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.

ఇదీ చదవండి:పరవళ్లు తొక్కుతున్న చిత్రకోట్​ జలపాతం

ABOUT THE AUTHOR

...view details