భారత్‌లో ఉనికి చాటుకునేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రయత్నాలు చేపట్టింది. భారత్‌లో నూతన శాఖను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్త బ్రాంచ్‌కు అరబిక్ భాషలో 'విలాయా ఆఫ్ హిందు' ( భారత రాష్ట్రం)గా నామకరణం చేసినట్లు అమాక్ న్యూస్ ఏజెన్సీ ద్వారా వెల్లడించింది ఐసిస్. అయితే ఈ నూతన శాఖ భౌగోళిక పరిధులపై స్పష్టత ఇవ్వలేదు.
కొత్త శాఖకు సంబంధించి ఈనెల 10నే టెలిగ్రామ్ యాప్ ద్వారా ఐసిస్ ఓ సందేశం పంపింది. మెషీన్ గన్లతో కూడిన ఐసిస్ ఉగ్రవాదులు కశ్మీర్ షోపియాన్ జిల్లా అమ్షీపురాలో భద్రతా సిబ్బందితో పోరాడారని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటన ఎప్పుడు జరిగిందో ఐసిస్ స్పష్టత ఇవ్వలేదు.
మీడియా కథనాల ప్రకారం మే 10న షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
పూర్తిగా అసత్యం...