మహాత్మా గాంధీకి సంబంధించిన ప్రదేశాలతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్‌ల్లోని పర్యాటక ప్రాంతాలకు కలిపి ఐఆర్సీటీసీ భారత్ దర్శన్ టూరిస్ట్ ప్యాకేజీని ప్రారంభిస్తోంది. ఈ ప్రత్యేక ప్యాకేజీ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభమవుతుందని రైల్వే పర్యటక, క్యాటరింగ్శాఖ తెలిపింది.
ఈ టూరిస్టు ప్యాకేజీ ద్వారా.. గాంధీజీ జన్మస్థలమైన పోర్బందర్, అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని దర్శించవచ్చు. అలాగే వడోదరలోని ప్రపంచంలోనే అతి ఎత్తైన వల్లభాయ్ ఐక్యతా విగ్రహాన్ని సందర్శించవచ్చు.
పర్యటన ఇలా..
ఈ పర్యటన ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లు కొనసాగుతుంది. మధ్యప్రదేశ్‌లోని రేవా నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. ఇండోర్ (ఓంకారేశ్వర్), ఉజ్జయిని (మహా కాళేశ్వర్), అహ్మదాబాద్, ద్వారక, పోర్బందర్, సోమనాథ్గా సాగి చివరకు వడోదర (ఐక్యతా విగ్రహం) వద్ద ముగుస్తుంది.