తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్​ కేసు: తిహార్​ జైలుకు చిదంబరం - కోర్టు

ఐఎన్ఎక్స్​ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈనెల 19 వరకూ 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ దిల్లీ రోజ్​ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది. చిదంబరాన్ని తిహార్​ జైలుకు తరలించారు అధికారులు.

ఐఎన్​ఎక్స్​ కేసు: తీహార్​ జైలుకు చిదంబరం

By

Published : Sep 5, 2019, 6:33 PM IST

Updated : Sep 29, 2019, 1:41 PM IST

ఐఎన్​ఎక్స్​ కేసు: తిహార్​ జైలుకు చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరాన్ని తిహార్​ జైలుకు తరలించారు. దిల్లీ రోజ్​ అవెన్యూ కోర్టు ఆయనకు ఈనెల 19 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించడమే ఇందుకు కారణం.

చిదంబరం అవసరమైన మందులు తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఆయనకు జెడ్​ కేటగిరీ రక్షణ ఉన్నందున జైలులో ప్రత్యేక గదిలో ఉంచాలని ఆదేశించింది.

జైలులో చిదంబరానికి సరైన రక్షణ ఉంటుందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా కోర్టుకు నివేదించారు. అయితే మనీలాండరింగ్​ కేసులో చిదంబరం సరండర్​ అవుతారంటూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై కోర్టు ఈడీకి నోటీసు ఇచ్చింది.

కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం గత నెల 21 నుంచి 15 రోజులపాటు సీబీఐ కస్టడీలో ఉన్నారు

Last Updated : Sep 29, 2019, 1:41 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details