ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను సీబీఐ అధికారులు దాదాపు 3 గంటలపాటు విచారించారు. చిదంబరం అధికారుల ప్రశ్నలకు ముక్తసరి సమాధానాలు చెప్పడం లేదా మౌనం వహించారని... విచారణకు సహకరించలేదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
విచారణ సందర్భంగా... చిదంబరాన్ని సీబీఐ అడిగిన ప్రశ్నలు...
- ఐఎన్ఎక్స్ మీడియాకు మీకు ఉన్న సంబంధం ఏమిటి?
- ఇంద్రాణి, పీటర్ ముఖర్జీలను ఎన్ని సార్లు కలిసారు? వారికి మీకు ఉన్న సంబంధాలేమిటి?
- వారితో కలిసిన సందర్భంలో డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలపై చర్చించారా?
- ఐఎన్ఎక్స్ మీడియా అంశంపై మీ వద్ద చర్చ జరిగినప్పుడు ఎవరెవరు హాజరయ్యారు?
- ఇంద్రాణి, పీటర్ ముఖర్జీలను.. కార్తీ చిదంబరంను కలవమని చెప్పారా?
- మీకు ఎన్ని బ్యాంక్ ఖాతాలున్నాయి? ఎక్కడెక్కడున్నాయి?
- మీ కుమారుని కంపెనీలలో పెట్టుబడులు పెట్టాలని అడిగారా? ఎంత పెట్టుబడి పెట్టమని అడిగారు?
అయితే చిదంబరం సరిగ్గా స్పందించలేదని సీబీఐ వర్గాలు తెలిపాయి.
కస్టడీకి కోరే అవకాశం