తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డిజిటల్ ప్లాట్​ఫాంలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు - digital yoga

ఆరో అంతర్జాతీయ 'యోగా డే' వేడుకలను ఆదివారం ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే ఈ సారి కరోనా కారణంగా వేడుకలను డిజిటల్ ప్లాట్​ఫాంలలో నిర్వహిస్తున్నారు. ఔత్సాహికులు ఉదయం నుంచే ఆసనాలు వేస్తూ సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. ప్రముఖ యోగా గురు రాందేవ్​ బాబా.. హరిద్వార్​లోని పతంజలి యోగా పీఠ్​లో ఆసనాలు వేశారు.

international yoga day celebrations in digital platforms
డిజిటల్ ప్లాట్​ఫాంలలో అంతర్జాతీయ యోగా డే వేడుకలు

By

Published : Jun 21, 2020, 8:04 AM IST

కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి అంతర్జాతీయ యోగా డే వేడుకలను 'యోగా ఎట్ హోం అండ్ యోగా విత్​ ఫ్యామిలీ' పేరిట పూర్తిగా డిజిటల్​ ప్లాట్​ఫాంలలోనే నిర్వహిస్తున్నారు. యోగా ఔత్సాహికులు ఉదయం నుంచే ఆసనాలతో వేడుకల్లో భాగస్వాములయ్యారు. ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా హరిద్వార్​లోని పతంజలి యోగా పీఠ్​లో ఆసనాలు వేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుజరాత్​ వడోదర లోని యోగా నికేతన్​.. వర్చవల్​గా యోగా​ కార్యక్రమాన్ని నిర్వహించింది. 15 దేశాలకు చెందిన పలువురు పాల్గొని కొవిడ్​-19పై ముందుడి పోరాటం చేస్తోన్న వారికి కృతజ్ఞతగా 108 సూర్య నమస్కారాలు చేశారు.

విదేశాల్లోని భారతీయ సంఘాలు యోగా డేను డిజిటల్, ఎలక్ట్రానిక్​ మీడియా వేదికగా జరుపుతున్నాయి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన పెంచేందుకు 'మై లైఫ్​- మై యోగా' వీడియో బ్లాగింగ్ పోటీలను మోదీ చేతుల మీదుగా మే 31న ప్రారంభించింది భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని యోగా ద్వారా పెంచుకోవచ్చని తెలిపింది.

ఈ పోటీలను భారత్​లో, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో దేశంలో నిర్వహించిన పోటీ నుంచి ఒక్కో విజేతను ఎంపిక చేస్తారు. వారంతా అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలి.

3 నిమిషాలు 3 ఆసనాలు

పోటీలో పాల్గొనేవారు 3 యోగాసనాలతో 3 నిమిషాల నిడివి గల వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. #MyLifeMyYogaINDIA హ్యాష్​ట్యాగ్ జత చేయాలి. యోగా ద్వారా తమ జీవితంలో వచ్చిన మార్పుపై సందేశమివ్వాలి.

యువత, పెద్దలు, యోగా వృత్తిలో ఉన్నవారికి మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు 2500డాలర్లు, 1500డాలర్లు, 1000డాలర్లతో పాటు ట్రోఫీని బహుమతిగా ఇస్తారు.

భారత్​లో మొత్తం ఆరు విభాగాల్లో యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేలు అందజేస్తారు . ఆదివారంతో పోటీదారులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. విజేతల పేర్లను జ్యూరీ ప్రకటిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details