దేశంలో దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాల హెచ్చరికలు జారీ చేశాయి. ఐఎస్ఐతో కలిసి జైషే మహ్మద్ సంస్థ ఈ పథక రచన చేసినట్లు హెచ్చరించాయి. జమ్ముకశ్మీర్ సహా పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశాయి.
దేశంలో ఉగ్రదాడులకు కుట్ర- నిఘా వర్గాల హెచ్చరిక
జమ్ము కశ్మీర్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు జైషే మహ్మద్, ఐఎస్ఐ ఉగ్రసంస్థలు కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఆగస్టు 20న సమావేశమై దాడికి పథక రచన చేసినట్లు తెలిపాయి.
దేశంలో ఉగ్రదాడులకు కుట్ర- నిఘా వర్గాల హెచ్చరిక
ఐఎస్ఐ, జేషే మహ్మద్‌కు చెందిన ముఫ్తీ రౌఫ్ అజ్ఘర్, షకీల్ అహ్మద్‌లు రావల్పిండిలో సమావేశమయ్యారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 20న ఈ సమావేశం జరిగిందని తెలిపాయి. సమావేశంలో రౌఫ్ సోదరుడు మౌలానా అమ్మార్ కూడా ఉన్నారని నిర్ధరించాయి. ఇస్లామాబాద్‌లోని మర్కజ్‌లో ఉగ్రదాడి ప్రణాళిక జరిగిందని స్పష్టం చేశాయి.