దిల్లీ అల్లర్ల కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. మురళీధర్ బదిలీపై ఇటీవలే రాజకీయ దుమారం రేగింది. భాజపా నేతలను కేసుల నుంచి రక్షించేందుకే న్యాయమూర్తిని బదిలీ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ విషయం తనకు ముందే తెలుసని తాజాగా జస్టిస్ మురళీధర్ తెలిపారు. ఫిబ్రవరి 17నే తనకు సమాచారం అందిందని స్పష్టం చేశారు. దిల్లీలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఫిబ్రవరి 17న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నుంచి సమాచారం అందింది. దిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం నిర్ణయం తీసుకుంది. పంజాబ్- హరియాణా కోర్టుకు బదిలీ చేసినందుకు నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు."