మోదీ కోసం తరలిన ప్రవాస భారతీయులు
ఐరాస సర్వసభ్య సమావేశాల్లో ప్రధాని నేరంద్ర మోదీ ఏం మాట్లాడుతారా? అని భారత్తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చేస్తున్నాయి. న్యూయార్క్లో మోదీ ప్రసంగం వినేందుకు అక్కడి ప్రవాస భారతీయులు బస్సుల్లో తరలివెళ్లారు. కశ్మీర్ అంశంపై చరిత్రాత్మక నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు.
మోదీ కోసం తరళివెళ్తున్న ప్రవాస భారతీయులు
అమెరికా న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ వేదికగా ఆయన ఏం మాట్లాడతారా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మోదీ ప్రసంగాన్ని వినేందుకు అక్కడి ప్రవాస భారతీయులు తరలివెళ్లారు. కశ్మీర్లో ఆర్టికల్ 370ను రద్దు చేసి మోదీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుందని ప్రశంసిస్తున్నారు.
Last Updated : Oct 2, 2019, 6:24 AM IST