తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశీయ తొలి 'సీఆర్​ఐఎస్​పీఆర్'​ కరోనా టెస్ట్​కు అనుమతి

కరోనా మహమ్మారి నిర్ధరణకు దేశీయంగా రూపొందించిన తొలి సీఆర్​ఐఎస్​పీఆర్​ కొవిడ్​-19 టెస్ట్​ను ప్రారంభించనుంది టాటా గ్రూప్​. ఇందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. కచ్చితమైన ఫలితాలు, సులభంగా వినియోగించేలా ఉంటుందని వెల్లడించింది. దీనిని టాటా గ్రూప్​, సీఎస్​ఐఆర్​-ఐజీఐబీ, భారతీయ వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా రూపొందించాయి.

India's first CRISPR COVID-19 test
దేశీయ తొలి 'సీఆర్​ఐఎస్​పీఆర్'​ కరోనా టెస్ట్​ ప్రారంభం

By

Published : Sep 19, 2020, 11:08 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్రమంలో వైరస్​ నిర్ధరణకు పలు పరీక్షలు చేపడుతున్నారు. అయితే.. దేశీయ తొలి సీఆర్​ఐఎస్​పీఆర్(క్లస్టర్డ్​ రెగ్యులర్లీ ఇంటర్​స్పేస్డ్​ షార్ట్​ పాలిండ్రోమిక్​ రిపీట్స్​)​ కొవిడ్​-19 టెస్ట్​ను​ ప్రారంభించేందుకు సిద్ధమైంది టాటా గ్రూప్​. దీనిని దేశంలో వినియోగించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది. ఈ కరోనా నిర్ధరణ పరీక్షను.. టాటా గ్రూప్​, సీఎస్​ఐఆర్​-ఐజీఐబీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

ఈ పరీక్షలో సార్స్​-కోవ్​-2 వైరస్​ జన్యుక్రమాన్ని గుర్తించేందుకు సీఆర్​ఐఎస్​పీఆర్​ సాంకేతికతను దేశీయంగా రూపొందించినట్లు టాటాసన్స్​ ప్రకటించింది. ఇది ప్రపంచంలోనే తొలిసారి ప్రత్యేక కాస్​-9 ప్రోటీన్​ను ప్రవేశపెట్టే పరీక్షగా పేర్కొంది సంస్థ. అలాగే.. సంప్రదాయ ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షల కచ్చితత్వ స్థాయులను చేరుకుంటుందని, సత్వర ఫలితాలు, కనిష్ఠ ధర, సులభంగా వినియోగించేలా ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా, సీఆర్​ఐఎస్​పీఆర్ అనేది భవిష్యత్తు సాంకేతిక పరిజ్ఞానం, ఇది భవిష్యత్తులో అనేక ఇతర వ్యాధికారక క్రిములను గుర్తించడానికి కూడా ఉపయోగపడనుందని తెలిపింది.

" టాటా సీఆర్​ఐఎస్​పీఆర్​ కరోనా టెస్ట్​కు అనుమతులు రావటం.. దేశ కరోనా కట్టిడి ప్రయత్నాలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇది దేశీయ శాస్త్రవేత్తలు, నిపుణుల ప్రతిభను ప్రతిబింబిస్తోంది. అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలకు భారత సహకారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది."

- గిరీష్​ క్రిష్ణమూర్తి, టాటా మెడికల్​, డయగ్నోస్టిక్స్​ సీఈఓ.

దేశీయంగా ఒక సురక్షితమైన, నమ్మకమైన, సరసమైన, సులభరీతిలో ఒక ఉన్నతమైన పరీక్ష సాంకేతికతను రూపొందించేందుకు.. సీఎస్​ఐఆర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ జెనోమిక్స్​ అండ్​ ఇంటిగ్రేటివ్​ బయోలజీ, భారతీయ వైద్య పరిశోధన మండలితో కలిసి పనిచేసింది టాటా గ్రూప్​.

ఇదీ చూడండి: వచ్చేవారమే 'ఆక్స్​ఫర్డ్​'​ మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​

ABOUT THE AUTHOR

...view details