తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇది ఓ ప్రజా ఉద్యమం- అంతిమ విజయం మనదే' - కొవిడ్ 19 భారత్

దేశంలో కరోనాపై ఉద్యమాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జన్​ ఆందోళన్​ పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రధాని. ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

coronavirus fight
'ఇది ఓ ప్రజా ఉద్యమం- అంతిమ విజయం మనదే'

By

Published : Oct 8, 2020, 10:33 AM IST

Updated : Oct 8, 2020, 12:16 PM IST

వచ్చేది పండగల సీజన్‌ కావడం వల్ల కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జన్‌ ఆందోళన్‌ పేరిట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ట్విట్టర్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు మోదీ. వైరస్ బారి నుంచి కాపాడుకునేందుకు రెండో విడత పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.

"భారత్​లో కరోనా పోరాటం ఓ ప్రజా ఉద్యమం. కరోనా యోధుల బలమే ప్రజల్ని ముందుండి నడిపిస్తోంది. ఇదే స్ఫూర్తిని మనం కొనసాగించాలి. ప్రజల ప్రాణాలు కాపాడాలి."

- నరేంద్ర మోదీ, ప్రధాని

"ఈ యుద్ధంలో ఐకమత్యంగా పోరాడదాం. ఎప్పుడూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మాస్కు ధరించండి. చేతులను శుభ్రంగా కడుక్కోండి. భౌతిక దూరాన్ని పాటించండి. రెండు గజాల దూరాన్ని అలవాటు చేసుకోండి. ఐకమత్యంగా గెలుద్దాం. కొవిడ్-19 పై పోరాటంలో విజయం మనదే.

- ప్రధాని నరేంద్ర మోదీ

Last Updated : Oct 8, 2020, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details