తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలో రామరాజ్య స్థాపనే ధ్యేయం'

అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమిపూజ సందర్భంగా ప్రపంచం మొత్తం భారత్​ వైపే చూస్తోంది. ఈ కార్యక్రమం జరగడం భారతదేశ అత్యంత అదృష్టమన్నారు యోగా గురు రామ్​దేవ్​ బాబా. ఆయనతో పాటు స్వామి చిదానంద సరస్వతి, ఉమా భారతి, స్వామి అద్వేషానంద్​ వంటి ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే చారిత్రక రోజని చెప్పారు.

India's biggest fortune that we're witnessing RamMandir event..
'దేశంలో రామరాజ్య స్థాపనే ధ్యేయం'

By

Published : Aug 5, 2020, 12:46 PM IST

Updated : Aug 5, 2020, 1:08 PM IST

అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. వీరిలో ప్రముఖ యోగా గురు రామ్​దేవ్​ బాబా, స్వామి చిదానంద సరస్వతి, ఉమాభారతి, స్వామి అద్వేషానంద్​ వంటి ప్రముఖులు ఉన్నారు. శతాబ్దాల కల నెరవేరుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. దేశ ఐక్యతను చాటిచెప్పే ఈ రోజు చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు.

" ఇది చిరస్మరణీయ కార్యక్రమం. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెబుతుంది. ప్రజల మధ్య అంతరాలను తగ్గించి ఏకం చేస్తుంది. మనమంతా ఓకే కుటుంబం."

-స్వామి చిదానంద సరస్వతి.

"ప్రపంచం మొత్తం భారత్​వైపే చూస్తోంది. సామరస్య సందేశాన్ని పంపే చారిత్రక రోజు ఇది."

-స్వామి అద్వేషానంద్​ గిరి.

"రామమందిర కార్యక్రమం జరగడం భారతదేశ అత్యంత అదృష్టం. దేశంలో రామరాజ్యాన్ని స్థాపించేందుకు పతంజలి యోగ్​పీఠ్ అధ్వర్యంలో అయోధ్యలో అతిపెద్ద గురుకులాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రపంచ దేశాలకు చెందిన వారు ఇక్కడకు వచ్చి​ వేద, ఆయుర్వేద శాస్త్రాలను నేర్చుకోవచ్చు."

-యోగా గురు రామ్​దేవ్ బాబా.

"అయోధ్య అందరినీ ఏకం చేసింది. భారత దేశంలో ఎలాంటి భేద భావాలు లేవని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసింది."

-ఉమా భారతి.

ఇదీ చూడండి: హనుమాన్​గఢీలో మోదీ ప్రత్యేక పూజలు

Last Updated : Aug 5, 2020, 1:08 PM IST

ABOUT THE AUTHOR

...view details