తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విదేశాల్లో భారతీయుల నల్లధనం రూ.34 లక్షల కోట్లు? - ఎన్​ఐఎఫ్​ఎం

భారతీయులు విదేశాల్లో దాచుకున్న నల్లధనం విలువ రూ.14.9 నుంచి 34 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఓ నివేదిక అంచనా వేసింది. మూడు సంస్థలు పరిశోధనలు జరిపి ఈ నివేదికను రూపొందించాయి.

విదేశాల్లోని భారతీయుల నల్లధనం రూ.34 లక్షల కోట్లు?

By

Published : Jun 24, 2019, 9:00 PM IST

Updated : Jun 25, 2019, 7:03 AM IST

విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనంపై ఎన్​ఐపీఎఫ్​పీ(నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ పాలసీ అండ్​ ఫైనాన్స్​) , ఎన్​సీఏఈఆర్(నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ అప్లైడ్​ ఎకనామిక్​ రీసెర్చ్​)​, ఎన్​ఐఎఫ్​ఎం(నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఫైనాన్సియల్​ మేనేజ్​మెంట్​) సంస్థలు పరిశోధన జరిపి ఓ నివేదిక రూపొందించాయి.

భారతీయులు అక్రమంగా విదేశాల్లో జమచేసిన నగదు విలువ రూ.14లక్షల కోట్ల నుంచి 34 లక్షల కోట్ల(216 నుంచి 490 బిలియన్​ డాలర్లు)వరకు ఉండొచ్చని అంచనా వేశాయి. 1980 నుంచి 2010 మధ్యకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందించాయి.

రియల్ ఎస్టేట్​, మైనింగ్​, ఫార్మాస్యూటికల్, పాన్​ మసాలా, గుట్కా, పొగాకు, సినిమా, విద్యా రంగాల నుంచే ఎక్కువగా నల్లధనం కూడబెట్టి ఉంటారని నివేదిక అంచనా వేసింది.

'స్టేటస్​ ఆఫ్ అన్​ అకౌంటెడ్​ ఇన్​కం బోత్​ ఇన్​సైడ్​ అండ్ ఔట్​సైడ్ కంట్రీ- ఏ క్రిటికల్ అనాలసిస్​' పేరుతో స్టాండింగ్ కమిటీ రూపొందించిన నివేదికను లోక్​సభ ముందుకు సోమవారం తీసుకువచ్చారు. నల్లధనం మూలాన్ని అంచనా వేసేందుకు ఎలాంటి ప్రమాణాలు లేవని నివేదికలో పేర్కొన్నారు.

ఎం. వీరప్ప మొయిలీ నేతృత్వం వహించిన పార్లమెంటరీ ప్యానెల్​ ఈ నివేదికను మార్చి 28 నే 16వ లోక్​సభ స్పీకర్​కు సమర్పించింది.

మూడు సంస్థలు రూపొందించిన నివేదిక ఆధారంగా నల్లధనం ఎంత మొత్తం ఉంటుందో ఓ అంచనాకు రాలేమని ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు.

దేశ విదేశాల్లోని నల్లధనంపై పరిశోధనలు జరిపి నివేదిక రూపొందించాలని 2011 మార్చిలో ఎన్​ఐపీఎఫ్​పీ, ఎన్​సీఏఈఆర్​, ఎన్ఐఎఫ్ఎంలను ఆర్థిక శాఖ ఆదేశించింది. నల్లధనాన్ని గుర్తించేందుకు ఆర్థిక శాఖ అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఈ నివేదిక సూచించింది.

ఇదీ చూడండి: 'మన ప్రధానమంత్రి మంచి సేల్స్​మన్​'

Last Updated : Jun 25, 2019, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details