తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అగ్రశ్రేణి విద్యాలయాల జాబితాలో భారత్​కు చోటు

ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల జాబితాలో మూడు భారతీయ యూనివర్సిటీలకు చోటు లభించింది. 'క్యూఎస్​ గ్లోబల్​ ర్యాంకింగ్స్​-2020' జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐఎస్​సీ బెంగళూరు సత్తా చాటాయి.

By

Published : Jun 20, 2019, 5:39 AM IST

ఐఐటీ దిల్లీ

భారత విద్యాసంస్థలు ప్రపంచ స్థాయిలో సత్తా చాటాయి. 'క్వాక్వారెల్లి సైమండ్స్​ (క్యూఎస్​) ర్యాంకింగ్స్​-2020'లో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలకు స్థానం దక్కింది. ప్రపంచంలోని అగ్రశ్రేణి 200 విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐఎస్​సీ బెంగళూరు నిలిచాయి.

అగ్రశ్రేణి 400 జాబితాలో ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఖరగ్​పుర్​, ఐఐటీ కాన్పుర్​, ఐఐటీ రూర్కీ ఉన్నాయి. 1000 జాబితాలో ఓపీ జిందాల్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం (జేజీయూ) సహా 50 కొత్త సంస్థలు ఉన్నాయి. స్థాపించిన అతి కొద్ది కాలంలో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న విద్యాసంస్థగా జేజీయూ నిలిచింది.

అగ్రశ్రేణి 200 జాబితాలో భారత విద్యాసంస్థలు రాణించటంపై కేంద్ర మానవ వనరుల మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: తమిళనాడు: ఐటీ కంపెనీలకూ నీటికొరత సెగ!

ABOUT THE AUTHOR

...view details