అంతకుముందు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ప్రధాని. ఈ వేడుకకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు - జాతీయపతాకం
73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు ప్రధాని. అనేక మంది ప్రముఖులు, ప్రజల సమక్షంలో మువ్వన్నెల జెండాకు వందనం చేశారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించారు మోదీ.
ఎర్రకోటపై త్రివర్ణ పతాకం రెపరెపలు- మోదీ వందనం
దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 1998-2003 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు ఎర్రకోటపై త్రివర్ణ జెండాను ఎగురవేశారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం. తాజాగా ఈ రికార్డును మోదీ సమం చేశారు.
ఇదీ చూడండి : స్వాతంత్ర్య వేడుకల వేళ... కశ్మీర్లో భద్రత కట్టుది
ట్టం
Last Updated : Sep 27, 2019, 1:50 AM IST