మహరాష్ట్రలోని పుణెలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న 45 మంది వలసదారులకు జిల్లా అధికారులు అంగీకారం తెలిపారు. వీరిలో ఎక్కువ మంది పాకిస్థాన్‌కు చెందిన వారే ఉండటం గమనార్హం. ఒకరిద్దరు అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారున్నారు.
పాకిస్థానీలకు భారత పౌరసత్వం - pakisthan migrants
పాకిస్థాన్ నుంచి వలస వచ్చి భారత్‌లో స్థిరపడ్డ 40 మందికి భారత పౌరసత్వం కల్పించారు పుణె జిల్లా అధికారులు. మరికొంత మంది వలసదారుల్లో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌కు చెందిన వారు ఉన్నారు.
పాకిస్థానీలకు భారత పౌరసత్వం
వీరు చాలాకాలం క్రితమే పుణెకి వలస వచ్చారు. కొంత మంది గత 40 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసముంటున్నారు. 1955 భారత పౌరసత్వ చట్టానికి చేసిన సవరణలకు అనుగుణంగా మైనారిటీలకు పౌరసత్వం వర్తింపజేశారు.
దరఖాస్తుల ఆమోదానికి ప్రభుత్వ నిఘా సంస్థల అనుమతి తప్పనిసరి. పౌరసత్వం కోసం చేసుకున్న దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని పుణె జిల్లా అధికారులు తెలిపారు. నిశిత పరిశీలన చేశామని, ఇతర సంస్థల అధికారుల నుంచి ఆమోదం లభించాకే పౌరసత్వం కల్పించామని స్పష్టం చేశారు.