తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా సైనికుడిని పీఎల్‌ఏకు అప్పగించిన భారత్​

భారత్​ అధీనంలో ఉన్న చైనా సైనికుడిని ఆ దేశ సైన్యానికి అప్పగించింది భారత్​. చుషుల్ మోల్దో సమావేశ ప్రాంతం వద్ద ఆ దేశ సైనికుడు కార్పరల్ వాంగ్ యా లాంగ్​ను మంగళవారం రాత్రి అధికారులు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.

Indian Army handed over the Chinese soldier Corporal Wang Ya Long to the Chinese Army at the Chushul Moldo meeting point, last night
చైనా సైనికుణ్ని పీఎల్‌ఏకు అప్పగించిన భారత్​

By

Published : Oct 21, 2020, 8:26 AM IST

సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా కార్పరల్ వాంగ్ యా లాంగ్‌ను చైనాకు అప్పగించింది భారత సైన్యం. చుషూల్ మోల్డో మీటింగ్ పాయింట్​ వద్ద చైనా సైనికుణ్ని మంగళవారం రాత్రి పీఎల్‌ఏకు అప్పగించినట్లు సైన్యం వెల్లడించింది.

తూర్పు లద్దాఖ్‌లో దెమ్‌చోక్‌ వద్ద వాంగ్ యా లాంగ్​ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. అతని వద్ద పౌర, సైన్యానికి సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ సైనికుడు గూఢచారిగా భారత్​కు వచ్చారా? లేక మరేదైనా ప్రణాళికతో వచ్చారా అనే అంశంపై భారత సైన్యం విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ప్రోటోకాల్‌ను అనుసరించి వాంగ్‌ను చైనాకు అప్పగిస్తామన్న సైన్యం...ఆ మేరకు మాట నిలబెట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details