తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'2030 నాటికి 2 కోట్ల 60 లక్షల హెక్టార్లకు పునరుజ్జీవం'

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఎడారీకరణ నియంత్రణ దిశగా అంతర్జాతీయ జల కార్యాచరణ అజెండా రూపొందించాలన్నారు ప్రధాని నరేంద్రమోదీ. నోయిడాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్(కాప్ 14) సదస్సులో ప్రసంగించారు.

'2030 నాటికి 2 కోట్ల 60 లక్షల హెక్టార్లకు పునరుజ్జీవం'

By

Published : Sep 9, 2019, 1:25 PM IST

Updated : Sep 29, 2019, 11:45 PM IST

భూముల పునరుజ్జీవం లక్ష్యాన్ని భారీగా పెంచుతున్నట్టు ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. సార క్షీణతతో దేశంలో ఎడారిగా మారిన 21 మిలియన్ హెక్టార్ల భూమికి 2030 నాటికి పునరుజ్జీవం పోయాలని గతంలో పెట్టుకున్న లక్ష్యాన్ని 26 హెక్టార్లకు పెంచుతున్నామని వెల్లడించారు.

నోయిడాలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆఫ్ పార్టీస్14( కాప్ 14) సదస్సులో మోదీ ప్రసంగించారు. 2015-17 మధ్య భారత్​లో 0.8 మిలియన్ హెక్టార్ల మేర అడవులు విస్తరించాయని చెప్పారు.

'క్షీణతపై ఐక్య పోరాటం'

భూక్షీణత, పర్యావరణం, జీవవైవిధ్యం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రపంచ దక్షిణ భూభాగంలోని వర్ధమాన దేశాలు పరస్పర సహకారం పెంపొందించుకోవాలని ఉద్ఘాటించారు మోదీ. వాతావరణ మార్పుల వల్ల కూడా ఏడారీకరణ జరుగుతోందన్నారు మోదీ. సముద్ర మట్టంలో పెరుగుదల, అలల ధాటి, అస్థిర వర్షాలు, తుపానులు, ఇసుక తుపానుల వల్ల సారవంతమైన భూమి క్షీణిస్తోందన్నారు మోదీ. పరిస్థితిని చక్కదిద్దేందుకు నీటి నిల్వలను తిరిగి పెంచడం, నీరు వేగంగా ఇంకిపోకుండా చేయటం, మట్టిలో తేమను పునరుద్ధరించటం వంటి వ్యూహాలను అమలు చేయాలని సూచించారు ప్రధాని.

'2030 నాటికి 2 కోట్ల 60 లక్షల హెక్టార్లకు పునరుజ్జీవం'

"భారత సంస్కృతిలో భూమిని పవిత్రంగా భావిస్తారు. భూమాత అని పిలుస్తారు. పర్యావరణ మార్పులతో ప్రపంచంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అందరూ అంగీకరిస్తారు. పర్యావరణ మార్పులపై వర్థమాన దేశాల మధ్య సహకారం ప్రతిపాదనకు భారత్ ఎంతగానో సంతోషిస్తోంది. ఎడారీకరణ కారణంగా ప్రపంచంలోని మూడింట రెండొంతుల దేశాలు ప్రభావితమవుతాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ సమస్యతో పాటు నీటి లభ్యత తగ్గడాన్ని ఎదుర్కొనేందుకు పని చేయాలి.

భూమి ఎడారీకరణను తగ్గించే వ్యూహంలో భాగంగా అంతర్జాతీయ నీటి కార్యాచరణ అజెండాను ఐరాస నేతలను కోరుతున్నాను. భూసారాన్ని తిరిగి సాధించడం అనే అంశం సుస్థిరాభివృద్ధికి అతి కీలక అంశం."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: నిబంధనలు పాటించమని చెప్పిన ఎమ్మెల్యేకే జరిమానా​!

Last Updated : Sep 29, 2019, 11:45 PM IST

ABOUT THE AUTHOR

...view details