తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నియంత్రణ రేఖ వెంబడి వాణిజ్యం రద్దు

పాకిస్థాన్​ నుంచి ఆయుధాల అక్రమ రవాణాపై కొరడా ఝుళిపించింది భారత ప్రభుత్వం​. జమ్ముకశ్మీర్​ నియంత్రణ రేఖ వెంబడి వాణిజ్య కార్యకలాపాలను నిలిపేసింది. సరిహద్దు వెంబడి ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ నోట్లను అక్రమంగా భారత్​లోకి తరలిస్తున్నారని ప్రభుత్వం వెల్లడించింది.

By

Published : Apr 19, 2019, 6:16 AM IST

Updated : Apr 19, 2019, 8:20 AM IST

నియంత్రణ రేఖ వెంబడి వాణిజ్యం రద్దు

పాకిస్థాన్​పై మరోమారు కఠిన చర్యలకు పూనుకుంది భారత ప్రభుత్వం. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా ఆదేశాలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.

వాణిజ్యం పేరుతో ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ నోట్లను అక్రమంగా దేశంలోకి రవాణా చేస్తున్నారని ఆరోపించింది భారత్. జమ్ము కశ్మీర్​లోని సలమాబాద్​, చక్కన్​ ద బాగ్ ప్రాంతా​ల్లో వాణిజ్యాన్ని నిలిపివేస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

రాజకీయ పార్టీల విమర్శలు

జమ్ముకశ్మీర్​ నియంత్రణ రేఖ వెంబడి వాణిజ్య నిలిపివేతపై స్థానిక రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఇది ఎన్నికల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమేనని పేర్కొన్నాయి.

"ఇన్నేళ్లుగా పూర్తి ట్రక్​ స్కానర్​ ఏర్పాటు కోసం పోరాటం చేశాం. దానికి బదులుగా వారు వాణిజ్యాన్నే మూసివేశారు. వాజ్​పేయీ హయాం నుంచి నియంత్రణ రేఖ వెంబడి వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. మన్మోహన్​ సింగ్ కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. వాజ్​పేయీని అనుసరిస్తానని ప్రకటించినవారు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. " -ఓమర్​ అబ్దుల్లా, జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి

ఎన్నికల జిమ్మిక్కు​

ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు గులాం నబీ ఆజాద్​ విమర్శలు చేశారు. ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్కేనని ఆరోపించారు. మోదీ హయాంలో సరిహద్దు వాణిజ్యం క్షీణించిందన్నారు. లోక్​సభ ఎన్నికల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని భాజపా చూస్తోందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: ''ఈవీఎం ఇస్తే తప్పేంటో అధ్యయనం చేస్తా''

Last Updated : Apr 19, 2019, 8:20 AM IST

ABOUT THE AUTHOR

...view details