పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తొలిసారిగా రూపొందిన హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ వెహికిల్(హెచ్ఎస్టీడివి)ను ఒడిశా తీరం నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది. డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి నుంచి బుధవారం ఉదయం 11 గంటల 25 నిమిషాలకు ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు డీఆర్డీవో వెల్లడించింది. హెచ్ఎస్టీడీవీ మానవ రహిత స్ర్కామ్ జెట్ డెమాన్‌స్ట్రేషన్ విమానమని డీఆర్డీవో అధికారులు తెలిపారు.
డీఆర్డీవో 'హైపర్‌సోనిక్' పరీక్ష విజయవంతం - DRDO
ఒడిశా తీరం నుంచి హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ వెహికిల్(హెచ్ఎస్టీడీవీ)ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు డీఆర్డీవో ప్రకటించింది.
డీఆర్డీవో హైపర్‌సోనిక్ టెక్నాలజీ పరీక్ష విజయవంతం
హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణించే ఈ వెహికిల్.. 20 సెకన్లలో 32.5 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. హెచ్ఎస్టీడీవీని భవిష్యత్తులో సుదూర ప్రాంతాల్లోని క్షిపణుల ప్రయోగాలకు, పౌర విమానయానానికి రెండు విధాలుగా వినియోగించే అవకాశం ఉందని రక్షణశాఖ అధికారి తెలిపారు. హైపర్‌సోనిక్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ వెహికిల్ వినియోగంతో తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను ప్రయోగించవచ్చని వెల్లడించారు.