తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో శరవేగంగా రోడ్ల నిర్మాణం - చైనా సరిహద్దు

సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్​ఓ వేగం పెంచింది. లేహ్​ను ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఉపయోగపడే రోడ్లను నిర్మిస్తోంది. ఇందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది. భారీ యంత్రాలను తరలించి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ రోడ్లు సైన్యానికి ఉపయోగపడతాయనే కారణంతో ఈ చర్యలు చేపట్టింది.

India steps up work on supply roads to Leh
సరిహద్దులో శరవేగంగా రోడ్ల నిర్మాణం

By

Published : Sep 6, 2020, 8:27 PM IST

Updated : Sep 6, 2020, 9:29 PM IST

చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత జవాన్లకు అన్ని విధాలుగా సహాయపడేందుకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేస్తోంది. సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ(బీఆర్​ఓ) కూడా తన వంతు పాత్ర పోషిస్తోంది. లేహ్​కు అనుసంధానించేందుకు చేపట్టిన రోడ్డు నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వాటిని సత్వరమే పూర్తిచేసేందుకు రాత్రింబవళ్లు కృషి చేస్తోంది. వాటితో పాటు కొండచరియలు విరిగి పడిన ప్రాంతాలను శుభ్రం చేస్తోంది. అవసరమైన చోటకు భారీ యంత్రాలను తీసుకెళ్లేందుకు సైన్యానికి ఈ రోడ్లు ఉపయోగపడతాయనే కారణంతో ఈ చర్యలు చేపట్టింది.

బీఆర్​ఓ అధికారుల ప్రకారం.. రోడ్డు నిర్మాణం కోసం కోట్ల రూపాయలు విలువ చేసే యంత్రాలను కొనుగోలు చేశారు. వీటితో రోడ్ల నిర్మాణం వేగవంతమవుతుందని ఆశిస్తున్నారు. కూలీలను పనిలోకి తీసుకుని.. వారాంతంలోనూ పనిచేయిస్తున్నారు.

ఇదీ చూడండి:-శత్రువు కన్నుగప్పి సరిహద్దుకు చేర్చే రహదారి సిద్ధం!

సరిహద్దులో ప్రస్తుతమున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారీ యంత్రాలను మోహరించారు. శీతాకాలంలో మంచును తొలగించేందుకు వీటిని వినియోగించనున్నారు.

ఇటీవలే పాండమ్​-యుల్​చుంగ్​-సుమ్దో ప్రాంతాన్ని.. ఒకటో నంబర్​ జాతీయ రహదారిలోని ఖాల్సితో అనుసంధానిస్తూ ఓ రోడ్డును నిర్మించింది బీఆర్​ఓ. ఇది సైన్యానికి ఎంతగానో ఉపయోగపడుతోంది.

ఇవీ చూడండి:-

Last Updated : Sep 6, 2020, 9:29 PM IST

ABOUT THE AUTHOR

...view details