తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జమిలి ఎన్నికలు భారత్​కు అవసరం'

ముంబయిపై పాకిస్థానీ​ ఉగ్రవాదులు చేసిన దాడిని భారత్​ ఎన్నటికీ మరువదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఉగ్రదాడుల్లో అమరులైనవారికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం సరికొత్త పంథాలో ఉగ్రవాదంపై పోరాడుతున్నట్లు తెలిపారు. ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సులో పాల్గొన్న ఆయన.. భారత్​కు జమిలీ ఎన్నికల అవసరం ఉందన్నారు.

modi
మోదీ

By

Published : Nov 26, 2020, 1:50 PM IST

Updated : Nov 26, 2020, 2:28 PM IST

ముంబయి ఉగ్రదాడుల్లో అసువులు బాసిన పోలీసులు, పౌరులకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల 80వ సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరువలేదని పేర్కొన్నారు.

"2008లో ఇదే రోజు.. పాకిస్థాన్​ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబయిపై దాడి చేశారు. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద దాడి. విదేశీ పౌరులతో సహా పోలీసులు చనిపోయారు. వాళ్లందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. భారత్ ఈ గాయాలను ఎన్నటికీ మరవదు. ఇప్పుడు భారత్ కొత్త విధానాలతో ఉగ్రవాదంపై పోరాడుతోంది. ఇందులో భాగమైన భద్రతా బలగాలకు నమస్కరిస్తున్నా."

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

జమిలీ ఎన్నికలపై..

'ఒక దేశం, ఒక ఎన్నిక' భారత్​కు చాలా అవసరమని ప్రధాని మోదీ అన్నారు. నెలల వ్యవధిలో దేశంలోని వేర్వేరు ప్రదేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఇది అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తోందన్నారు. ఈ అంశాన్ని అధ్యయనం చేసి.. ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయాలని ప్రిసైడింగ్​ అధికారులకు మోదీ సూచించారు.

ఇదీ చూడండి:26/11 ముంబయి ఉగ్ర దాడులకు 12 ఏళ్లు

Last Updated : Nov 26, 2020, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details