విద్యాభ్యాసం కోసం భారత్కు వస్తున్నవారిలో నేపాలీలే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. తర్వాత స్థానంలో అఫ్గానిస్థాన్ వాసులు ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గణాంకాల ద్వారా తెలిసింది.
విదేశీయుల్లో అత్యధికులు కర్ణాటకలో చదువుకునేందుకు మొగ్గుచూపుతున్నట్లు హెచ్ఆర్డీ లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం 47వేల 427 మంది ఉన్నత విద్యాభ్యాసం చేస్తుండగా... వీరిలో 10 వేల 23 మంది కర్ణాటకలోనే ఉన్నారు.
రాష్ట్రాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య
రాష్ట్రం | సంఖ్య |
కర్ణాటక | 10,023 |
మహారాష్ట్ర | 5,003 |
పంజాబ్ | 4,533 |
యూపీ | 4,514 |
తమిళనాడు | 4,101 |
హరియాణా | 2,878 |
దిల్లీ | 2,141 |
గుజరాత్ | 2,068 |
తెలంగాణా | 2,020 |