తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉగ్రవాదంపై తీరు మార్చుకోని పాకిస్థాన్' - PAKISTHAN

పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహ్మద్ పాత్రపై పాక్ మరిన్ని ఆధారాలు కోరటంపై ఆగ్రహం వ్యక్తంచేసింది భారత్. సరిహద్దు ఉగ్రవాదంపై కప్పిబుచ్చే ధోరణిని పాక్​ ఇంకా మానలేదని ఆరోపించింది.

"ఉగ్రవాదంపై పాకిస్థాన్​ తీరు మారలేదు"

By

Published : Mar 29, 2019, 7:10 AM IST

Updated : Mar 29, 2019, 7:26 AM IST

'ఉగ్రవాదంపై తీరు మార్చుకోని పాకిస్థాన్'
ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ వైఖరిపై భారత్​ అసంతృప్తి వ్యక్తం చేసింది. పుల్వామా ఉగ్రదాడిలో జైషే మహ్మద్​ పాత్రపై మరిన్ని ఆధారాలు కోరటాన్ని తప్పుబట్టింది. సరిహద్దు ఉగ్రవాదంపై కప్పిబుచ్చుకోవటాన్ని పాక్ ఇంకా మానలేదని విమర్శించింది.

"పుల్వామా దాడి విషయంలో పాక్​ స్పందిస్తోన్న తీరుపై భారత్ అసంతృప్తితో ఉంది. పుల్వామా దాడిని ఉగ్రవాద చర్యగా ఇప్పటికీ పాక్ పరిగణించట్లేదు. ఉగ్రవాదం విషయంలో పాక్ వైఖరి మారలేదు. పఠాన్​కోట్​, ముంబయి దాడుల సమయంలో పాక్​ ఏం చెప్పిందో ఇప్పుడూ అవే మాటలు చెబుతోంది. భారత్​పై దాడులకు పాల్పడే ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వమని 2004లో చెప్పింది. ఇచ్చిన మాటకు ఆ దేశం కట్టుబడి ఉండాలి. తక్షణమే ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే."
- రవీశ్ కుమార్, భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

Last Updated : Mar 29, 2019, 7:26 AM IST

ABOUT THE AUTHOR

...view details