దేశంలో కరోనా రక్కసి పంజా విసురుతోంది. 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 11 వేల 929 మంది వైరస్ బారినపడ్డారు. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. వరుసగా రెండో రోజు 11 వేలకుపైగా కొత్త కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
దేశంలో 24 గంటల్లో 11,929 కేసులు, 311 మరణాలు
భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 20 వేలు దాటింది. మరో 311 మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం
మహారాష్ట్రలో అత్యధికంగా 3830 మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య 1,04,568కు చేరింది. గుజరాత్లో1448 మంది, దిల్లీలో 1271, మధ్యప్రదేశ్లో 447, బంగాల్లో 463 మంది మరణించారు.
Last Updated : Jun 14, 2020, 12:47 PM IST