గోవాలో 1500 మంది నావికాదళ సిబ్బంది మానవహారంగా ఏర్పడి.. కొవిడ్ బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సంఘీభావం ప్రకటించారు.
కరోనా యోధులకు కృతజ్ఞతగా నౌకదళ సిబ్బంది మానవహారం
12:32 May 03
12:25 May 03
దిల్లీ నరేలా క్వారంటైన్ సెంటర్ ఎదుట బ్యాండ్స్ వాయిస్తున్న సైనిక దళాలు
12:00 May 03
జైపుర్ సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రి మీదుగా యుద్ధవిమానాల విన్యాసాలు
11:58 May 03
దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిపై సాయుధ దళ చాపర్ల విన్యాసాలు
11:51 May 03
కరోనా వీరులకు అభినందన కార్యక్రమంలో భాగంగా... తొలుత దిల్లీలోని జాతీయ పోలీసు స్మారకం వద్ద నివాళులు అర్పించారు త్రివిధ దళాల ప్రతినిధులు.
11:31 May 03
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ చిరాయు మెడికల్ కాలేజ్‌లోని వైద్యులకు సంఘీభావంగా పూలతో వందనం సమర్పించాయి సైనిక బలగాలు.
11:30 May 03
లద్ధాక్‌లోని లేహ్ ఎస్ఎన్ఎం ఆసుపత్రి మీదుగా వైమానిక దళ చాపర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైద్యులను అభినందిస్తూ ఆకాశంలోనుంచి పూల వర్షం కురిపించారు.
11:21 May 03
చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా వైమానిక దళ చాపర్ల విన్యాసాలు
10:44 May 03
కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌పై చక్కర్లు కొట్టిన భారత వైమానిక చాపర్లు.. పూలతో వందనం సమర్పించాయి.
10:43 May 03
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీపై చాపర్లు పూల వర్షం కురిపించాయి.
10:37 May 03
సుకోయ్-30 విన్యాసాలు..
కరోనా బాధితులకు క్లిష్ట పరిస్థితుల్లోనూ సేవ చేస్తున్న వైద్య సిబ్బంది అభినందించే కార్యక్రమం దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతోంది. ముంబయిలో ఆసుపత్రుల మీదుగా సుకోయ్-30 యుద్ధవిమానాలు విన్యాసాలు నిర్వహించాయి. వైద్యులు, జనం ఆసక్తిగా తిలకించారు.
10:24 May 03
రాజ్‌పథ్ మీదుగా యుద్ధవిమానాల విన్యాసాలు..
కరోనా వీరుల్ని కీర్తిస్తూ.. భారత యుద్ధ విమానాలు దిల్లీ రాజ్‌పథ్ మీదుగా ఫ్లైఫాస్ట్ నిర్వహించాయి. వివిధ విన్యాసాలు చేసి.. వారి కీర్తి ప్రతిష్ఠలను దేశ నలుమూలలా ఇనుమడింపజేసింది.
10:11 May 03
గోవాలో నావీ చాపర్..
వైద్యులకు సంఘీభావం ప్రకటిస్తూ.. పనాజీలోని గోవా మెడికల్ కాలేజీపై పూల వర్షం కురిపించింది నావికాదళానికి చెందిన చాపర్. వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని వీరులుగా కీర్తిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని తలపెట్టింది భారత సైన్యం.
10:01 May 03
కరోనాపై నిరంతరం శ్రమిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతగా హరియాణా పంచకుల ప్రభుత్వాస్పత్రి ఎదుట గౌరవవందనం చేసింది భారత సైన్యం. ఆకాశంలోనుంచి హెలికాఫ్టర్లు, చాపర్ల ద్వారా.. కరోనా యోధులపై పూల వర్షం కురిపించింది.
09:36 May 03
కరోనా యోధులకు వందనం..
దేశంలో కరోనా యోధులకు సంఘీభావంగా భారత వైమానిక దళాలకు చెందిన చాపర్లు.. దిల్లీ పోలీసు యుద్ధ స్మారకం వద్ద పూలవర్షం కురిపించాయి. పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాయి.
09:29 May 03
దేశంలో 24 గంటల్లోనే మరో 83 మంది మృతి
భారత్‌లో కరోనా విజృంభణ మరింత తీవ్రమైంది. గడిచిన 24 గంటల్లో మరో 83 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2644 మంది వైరస్ బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు వెల్లడించింది.
మొత్తం కేసులు : 39980
యాక్టివ్ కేసులు : 28046
మరణాలు : 1301
కోలుకున్నవారు : 10632
వలస వెళ్లిన వారు : 1