తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మసూద్​ను వదిలే ప్రసక్తే లేదు"

మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. చైనా ఈ విషయానికి అడ్డుపడటంపై భారత్​ సంయమనం పాటిస్తున్నట్లు పేర్కొన్నాయి.

మసూద్​

By

Published : Mar 16, 2019, 2:49 PM IST

జైషే మహ్మద్​ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్​ చాలా కాలం నుంచి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని భారత్​ పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలితో చర్చలు జరుపుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మసూద్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించకుండా చైనా అడ్డుపడుతోంది. డ్రాగన్​ దేశం ఇలా నాలుగు సార్లు అడ్డుపుల్ల వేసింది. ఈ విషయంపై సంయమనం పాటిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కొన్ని రోజులుగా ఉగ్రవాద సంస్థలపై పాక్ తీసుకున్న చర్యలు కేవలం కంటితుడుపు మాత్రమేనని ఆరోపించారు.

"చైనాకు ఉగ్రవాదం పెద్ద సమస్య. పాకిస్థాన్​ కేంద్రంగా చాలా ఉగ్రవాద సంస్థలు పని చేస్తున్నాయన్న విషయం వారికి తెలుసని భారత్​ విశ్వసిస్తోంది"- అధికారిక వర్గాల ప్రకటన

ABOUT THE AUTHOR

...view details