భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తూ సరిహద్దులో శాంతి, సామరస్యానికి కృషి చేస్తున్నాయని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2017లో డోక్లాం ఉద్రిక్తతలు ముగిసిన తర్వాత రెండు దేశాల సైన్యాలు పూర్తి సంయమనం పాటిస్తున్నాయని తెలిపారు.
సరిహద్దుల్లో సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని లోక్సభలో విపక్షాలు చేసిన ఆరోపణలకు మంత్రి సమాధానమిచ్చారు.
రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి
"భారత్, చైనా మధ్య ప్రాదేశిక శాంతి ఉంది. వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని విభేదాల వల్ల గతంలో కొన్ని సమస్యలు వచ్చిన మాట నిజమే. 2018 ఏప్రిల్లో వుహాన్ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ మధ్య భేటీ జరిగింది. సరిహద్దుల వద్ద శాంతి, సామరస్యం నెలకొల్పాలని ఆ భేటీలో తీర్మానించారు. అప్పటి నుంచి రెండు దేశాల సైన్యానికి వ్యూహాత్మక అంశాలనూ నిర్దేశించారు. ఈ విధంగా సరిహద్దుల్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దేశ రక్షణ విషయంలో భారత ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాం."
-రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి
ఇదీ చూడండి: 'రాజీనామాపై వెనక్కి తగ్గం- పరీక్షకు హాజరుకాం'