తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డిజిటల్​ కిరాణం'లో దూసుకెళ్తున్న భారత్​ - ఆన్​లైన్ మార్కెట్

ఉరుకులు పరుగుల జీవితంలో కిరాణా సామాను కోసం దుకాణానికి వెళ్లే సమయం ఎక్కడుంది? అందుకే భారతదేశంలో ఆన్​ లైన్​ షాపింగ్​ వేగంగా పెరిగిపోతోంది. వందల కొద్దీ ఆన్​లైన్​ వ్యాపార సంస్థలు విభిన్న విధానాలతో వినియోగదారులను ఆకర్షించి లాభాలు ఆర్జిస్తున్నాయి.

ఆన్​లైన్​ కొనుగోళ్లకే భారత్​ ఓటు

By

Published : Jul 8, 2019, 5:48 PM IST

Updated : Jul 9, 2019, 12:12 AM IST

ఆన్​లైన్​ కిరాణా షాపింగ్​లో ఆసియాలోకెల్లా భారతదేశం​ శరవేగంగా దూసుకుపోతున్నట్లు ఐజీడీ ఆసియా సంస్థ సర్వేలో తేలింది. దేశంలో మౌలిక సదుపాయాలు అనుకూలిస్తున్నందున ఆన్​లైన్ మార్కెట్​లో పెట్టుబడులు విపరీతంగా పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది ఆ సంస్థ . అధిక జనాభాకు తగ్గట్టుగా సరికొత్త చెల్లింపు విధానాలతో వచ్చే ఐదేళ్లలో భారత్​లో ఆన్​లైన్​ మార్కెట్ వేగంగా పుంజుకుంటుందని అంచనా వేసింది.

ఆసియాలోని మొదటి 12 ఆన్​లైన్​ కిరాణా మార్కెట్లలో భారత్​, చైనా, తైవాన్​, దక్షిణ​ కొరియా, ఇండోనేషియా, థాయ్​ల్యాండ్​, సింగపూర్​లు​ ఉన్నాయి.

ఐజీడీ అంచనా ప్రకారం భారత ఈ-కామర్స్​ మార్కెట్​ 2022కల్లా 32.7 బిలియన్ డాలర్ల నుంచి 71.​9 బిలియన్​ డాలర్లకు పెరిగే అవకాశముంది.

చిల్లర వ్యాపారులకు 'ఆన్​లైన్'​ ముప్పు?

దేశంలో ఆన్​లైన్​ షాపింగ్​కు ఆదరణ పెరుగుతున్న తరుణంలో చిల్లర వర్తకుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. అందుకే ప్రభుత్వం ఇటీవల ఆన్​లైన్​ వ్యాపార నియంత్రణ చట్టాలు తీసుకొచ్చింది. భాగస్వామ్య కంపెనీల ఉత్పత్తులను అమ్మకూడదని అమెజాన్​ వంటి కంపెనీలపై ఆంక్షలు విధించింది. ఈ నియమాల కారణంగా ఆన్​లైన్​ మార్కెట్​ వృద్ధి కాస్త నెమ్మదించే అవకాశం ఉందని అంచనా వేసింది ఐజీడీ.

Last Updated : Jul 9, 2019, 12:12 AM IST

ABOUT THE AUTHOR

...view details