తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేడియో గురూ: పాఠాలు చెప్పే ఆకాశవాణికి శ్రోతలెందరో!

'ఈరోజుల్లో రేడియోలో వార్తలు, విద్యా కార్యక్రమాలు వినేదెవరు?' అనుకునేవారికి.. 'హలో మోగీనంద్' సమాధానం చెప్పింది.​ 7 నెలల క్రితం ప్రారంభమైన ఆ క్యాంపస్​ రేడియోకు దేశ విదేశాల్లో విశేష ఆదరణ లభించింది. అందుకే మరింత ఉత్సాహంతో కొత్త కార్యక్రమాలను రూపొందిస్తోంది.

రేడియో గురూ: పాఠాలు చెప్పే ఆకాశవాణికి శ్రోతలెందరో!

By

Published : Aug 31, 2019, 5:12 AM IST

Updated : Sep 28, 2019, 10:45 PM IST

రేడియో గురూ: పాఠాలు చెప్పే ఆకాశవాణికి శ్రోతలెందరో!

హిమాచల్​ప్రదేశ్​ నహన్​లోని ప్రభుత్వ పాఠశాల ప్రారంభించిన విద్యా రేడియో స్టేషన్ 'హలో మోగీనంద్' అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం 7 నెలల్లో 7 వేల మంది శ్రోతలను సంపాదించుకుంది.

విద్యార్థులకు అవసరమయ్యే కార్యక్రమాలు మాత్రమే ప్రసారం చేస్తుంది ఈ రేడియో స్టేషన్​. ఇలాంటివి దేశంలో మరో 5 మాత్రమే ఉన్నాయి. క్యాంపస్​ రేడియోగా ప్రారంభమైన 'హలో మోగీనంద్​'.. మనదేశంలోనే కాక విదేశాల్లోనూ మారుమోగుతోంది.

పెరుగుతున్న శ్రోతల సంఖ్యను చూసి పాఠశాల నిర్వాహకుల ఉత్సాహం రెట్టింపైంది. సెప్టెంబర్ 12 తరువాత మరో 5 కొత్త విద్యా సంబంధిత కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

"ఈ రేడియో స్టేషన్‌ను ప్రారంభించడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. పాఠశాలకు హాజరుకాలేని పిల్లలు ఈ రేడియో ద్వారా పాఠాలు వినవచ్చు. రేడియో కొత్త షెడ్యూల్​ ప్రకారం విద్యా సంగీతం, ఇంటర్వ్యూ వంటి కార్యక్రమాలు జోడిస్తాం. 'బులందీ' పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమాలు చేసిన వారిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం."

-సంజీవ్​ అథ్రి, రేడియో స్టేషన్ డైరెక్టర్

ఇదీ చూడండి:12వేల టెంకాయలతో నారికేళ గణనాథుడు!

Last Updated : Sep 28, 2019, 10:45 PM IST

ABOUT THE AUTHOR

...view details