తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉరితీసే అవకాశమివ్వండి..' రక్తంతో క్రీడాకారిణి లేఖ

నిర్భయ దోషులను ఉరి తీసే అవకాశమివ్వాలని అమిత్​ షాకు రక్తంతో లేఖ రాశారు భారత క్రీడాకారిణి వర్తికా సింగ్​. తన విజ్ఞప్తికి మహిళలందరూ మద్దతు పలకాలని తెలిపారు.

In blood-written letter, shooter wants Centre to let her hang Nirbhaya convicts
'ఉరితీసే అవకాశమివ్వండి..' రక్తంతో క్రీడాకారిణి లేఖ

By

Published : Dec 15, 2019, 10:19 PM IST

Updated : Dec 15, 2019, 10:38 PM IST

భారత షూటర్​ వర్తికా సింగ్​.. తన రక్తంతో కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు. నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం కల్పించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

రక్తంతో క్రీడాకారిణి లేఖ

"‘నా చేతిలో ఉన్న ఈ లేఖ హోంమంత్రి అమిత్‌షాకు రాసింది. దీన్ని నా రక్తంతో రాశా. నిర్భయ దోషులకు తలారీగా వ్యవహరించే అవకాశం ఇవ్వాలని అందులో కోరా. భారత్‌లో మహిళలను దేవతలుగా చూసే సంస్కృతిని బలోపేతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. మహిళ కూడా ఉరి తీయగలదన్న విషయాన్ని అత్యాచార దోషులు తెలుసుకోవాలి. ఈ లేఖను రిజిస్టర్‌ పోస్టు ద్వారా పంపిస్తా."

---వర్తికా సింగ్‌, క్రీడాకారిణి.

తన విజ్ఞప్తికి మహిళా సైనికులు, నటీమణులు, మహిళా ప్రముఖులు మద్దతు తెలపాలని కోరారు. మహిళలు భయపడుతూ బతికే రోజులు పోవాలని అభిప్రాయపడ్డారు వర్తికా.

ఎన్నో విజ్ఞప్తులు...

నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం తమకు ఇవ్వాలంటూ.. తిహాడ్‌ జైలుకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. మేరట్​కు చెందిన ఓ తలారీ కూడా ఇదే విధంగా లేఖ రాశారు.

దోషుల్లో ఒకరు తన మరణశిక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్​ వేశాడు. దీనిపై మంగళవారం నిర్ణయం తీసుకోనుంది.

ఇదీ చూడండి:- దేశంలో ఎన్నో 'నిర్భయ' కేసులు... శిక్షలేవి?

Last Updated : Dec 15, 2019, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details