నీతా కన్వార్.. చదువుతో పాటు పెళ్లి చేసుకోవాలని పాకిస్థాన్ సింధ్ నుంచి 18 ఏళ్ల క్రితం రాజస్థాన్‌కు వలస వచ్చారు. 4 నెలల క్రితం భారత పౌరసత్వాన్ని పొందారు. ఇప్పుడు ఏకంగా రాజస్థాన్‌లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
"12వ తరగతి వరకు పాకిస్థాన్ సింధ్‌లో చదువుకున్నా. తర్వాత ఆజ్మేర్లో బీఏ చదివా. నేను పాక్ నుంచి వచ్చి 18 ఏళ్లు అవుతోంది. 8 ఏళ్ల క్రితం పుణ్య ప్రతాప్ కరణ్‌ను పెళ్లి చేసుకున్నా. 4 నెలల క్రితం పౌరసత్వం లభించింది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.
ఇక్కడి రాజ్‌పుత్ సంస్కృతి సంప్రదాయాలు నాకు నచ్చాయి. విద్య విషయంలో మహిళలకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడివారు నన్నెంతో బాగా చూసుకుంటారు. అందుకే పోటీలో నిలుచున్నా. మా మామయ్య 3 సార్లు సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన ప్రోత్సాహంతోనే ఇప్పుడు పోటీ చేస్తున్నా. ఆయనే నాకు మార్గదర్శి."