వీలైనంత తొందరగా జమ్ము కశ్మీర్ లోయను వదిలి వెళ్లాలని అమర్నాథ్ యాత్రికులను హెచ్చిరించింది ఆ రాష్ట్ర హోంశాఖ. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల సమాచారం అందిన నేపథ్యంలో ముందస్తు చర్యలకు ఉపక్రమించింది కశ్మీర్ ప్రభుత్వం.
యాత్రికులే లక్ష్యంగా తీవ్రవాదులు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు నివేదికలు వచ్చాయని హోంశాఖ తెలిపింది. యాత్రికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి వారి యాత్రా నివాసాలను ఖాళీ చేయాలని సూచించినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు.