తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దాడి చేస్తే జీవితంలో మరిచిపోలేని సమాధానమిస్తాం'

దేశంపై దాడికి దిగితే జీవితంలో మరిచిపోలేని సమాధానమిస్తామని పరోక్షంగా పాకిస్థాన్​ను హెచ్చరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రెచ్చగొట్టే చర్యలు చేసినా సంయమనం పాటించామని గుర్తుచేశారు.

వెంకయ్యనాయుడు

By

Published : Sep 6, 2019, 4:22 PM IST

Updated : Sep 29, 2019, 3:59 PM IST

రెచ్చగొట్టే చర్యలు చేపట్టినా భారత్​ సంయమనం పాటిస్తోందని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కానీ దాడులకు పాల్పడితే.. శత్రుమూకలకు జీవితంలో మరిచిపోలేని సమాధానం చెబుతామని పాకిస్థాన్​కు పరోక్ష హెచ్చరికలు పంపారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ రెండేళ్లలో చేసిన 95 ప్రసంగాలపై ముద్రించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య.

"మీరు గమనిస్తూనే ఉన్నారు.. కొద్ది కాలంగా కొందరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నప్పటికీ మనము ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ ఒకవేళ ఎవరైనా దాడులు చేస్తే.. వారికి జీవితంలో మర్చిపోలేని సమాధానమిస్తాం. రెచ్చగొట్టేవారితో సహా ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి"

- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి.

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370 రద్దు నేపథ్యంలో భారత్-పాక్​ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ వెంకయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి: జాబిల్లి కోసం: చంద్రయాన్​-1 సూపర్​ హిట్​.. కానీ...

Last Updated : Sep 29, 2019, 3:59 PM IST

ABOUT THE AUTHOR

...view details