హరియాణా సోనిపత్ కేజీపీ ఎక్స్ప్రెస్ వేపై భారత వాయుసేన హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తిన కారణంగానే ఇలా చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హరియాణాలో ఐఏఎఫ్ హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ ఈ సమస్యను ముందుగా గుర్తించిన పైలెట్ అధికారులకు తెలియజేశారు. సంబంధిత సిబ్బంది, సాంకేతిక నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు.
"హెలికాప్టర్లో తలెత్తిన సమస్యను పరిష్కరించటానికి 90 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అనంతరం హెలికాప్టర్ వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ ఆపరేషన్ ముగిసేంత వరకు వాహన రాకపోకలను నిలిపివేశాం."
-సంబంధిత అధికారులు
ఇదీ చూడండి:'ఆమె' పురుషుడే... 30 ఏళ్ల తర్వాత తేల్చిన వైద్యులు