సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. భారత్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు బ్రహ్మోస్ క్షిపణితో భారీ ప్రయోగాన్ని చేపట్టింది భారత వాయిసేన. సుఖోయ్-30 ఎమ్కేఐ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించిన బ్రహ్మోస్.. 4 వేల కిలోమీటర్ల దూరంలోని హిందూ మహసముద్రంలో ఉన్న నౌకను ధ్వంసం చేసింది.
బ్రహ్మోస్‌తో టార్గెట్ చేస్తే.. 4వేల కి.మీ దూరమైనా ఫట్
భారత వాయుసేన మరోసారి సత్తా చాటింది. తమ అణ్వస్త్ర పొదిలో ఉన్న బ్రహ్మోస్ క్షిపణిని మళ్లీ విజయవంతంగా ప్రయోగించింది. ఈసారి 4వేల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌ను ఛేదించడం విశేషం.
BrahMos supersonic cruise missile
పంజాబ్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన విమానం మార్గమధ్యలో గాలిలోనే ఇంధనం నింపుకొని లక్ష్యం వైపు దూసుకెళ్లినట్లు వాయిసేన అధికారులు తెలిపారు.
Last Updated : Oct 30, 2020, 9:31 PM IST