కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని ప్రకటించారు. భాజపా, నరేంద్ర మోదీకి దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలు ఎవరూ నిరుత్సాహపడొద్దని కోరారు.
ఓటమి వైఫల్యాలపై చర్చించడానికి ఇది సరైన సమయం కాదని రాహుల్ అభిప్రాయపడ్డారు.
'తీర్పును గౌరవిస్తున్నాం- కార్యకర్తలు అధైర్యపడొద్దు' - ప్రజాతీర్పు
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఓటమి కారణాలపై మట్లాడటానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. కార్యకర్తలు నిరాశ చెందొద్దని ధైర్యం చెప్పారు.
ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం... కార్యకర్తలు అధైర్యపడొద్దు
"నేను ప్రచారంలో చెప్పాను... ప్రజలు విజ్ఞులు. వారి ఓటుతో నేడు తీర్పు ఇచ్చారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను. భాజపా, మోదీకి శుభాకాంక్షలు. ఎందుకు ఓటమిపాలయ్యామో అన్నది ఇప్పుడు ముఖ్యం కాదు. ప్రజలు తీర్పు ఇచ్చారు ఇదే ముఖ్యం. ప్రజలు మరోసారి మోదీనే ప్రధానిగా ఎన్నుకున్నారు. అమేఠీలో స్మృతి ఇరానీ విజయానికి శుభాకాంక్షలు. ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు
Last Updated : May 23, 2019, 7:26 PM IST