తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబుల్​ ధమాకా​: భార్యాభర్తలు పరీక్షల్లో టాప్ - చదువు

కలిసి చదువుకొని.. పెళ్లిచేసుకున్నవారు సాధారణంగా జీవితాన్ని పంచుకోవడం చూస్తుంటాం. కానీ.. పెళ్లి తరువాతా కలిసి చదువుకున్నవారెంతమంది? అదే కోవలోకి వస్తారీ జంట. ఏకంగా... ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. అదెక్కడో తెలుసుకోవాలనుందా..?

భార్యాభర్తలు పరీక్షల్లో అగ్రగాములు

By

Published : Jul 27, 2019, 5:43 PM IST

Updated : Jul 27, 2019, 7:33 PM IST

డబుల్​ ధమాకా​: భార్యాభర్తలు పరీక్షల్లో అగ్రగాములు

ఛత్తీస్​గఢ్​ బిలాస్​పుర్​కు చెందిన ఓ పెళ్లైన జంట ఇప్పుడు వార్తల్లోకెక్కింది. అదెలా అని అనుకుంటున్నారా.. చదువులో ప్రతిభ, ఎనలేని పట్టుదల, విశ్వాసం చూపి.

బిలాస్​పుర్​ వాసి అనుభవ్​ సింగ్​ రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​కు ఎంపికవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి అదే విధంగా ముందుకెళ్లారు. చదువు పూర్తవగానే ప్రభుత్వ పరీక్షల కోసం సిద్ధమయ్యారు. 2008లో పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే ఓ ఇన్​స్టిట్యూట్​లో అమ్మాయి పరిచయమైంది. పేరు విభా సింగ్​. అప్పటి వారి పరిచయం ప్రేమగా మారింది. 2014లో అది కాస్తా వివాహబంధమైంది. పెళ్లయ్యాకా ఇరువురూ పోటీ పరీక్షలకు హాజరయ్యారు.

వారి కల ఫలించింది. అనుకున్నది సాధించారు. ఇటీవల నిర్వహించిన చీఫ్​ మున్సిపల్​ ఆఫీసర్​(గ్రేడ్​బీ, గ్రేడ్​సీ) పరీక్షలకు ఇరువురూ హాజరయ్యారు. తాజాగా వెల్లడించిన ఫలితాల్లో ఈ భార్యాభర్తలిద్దరూ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అనుభవ్​కు 298.3744 మార్కులు రాగా.. విభా సింగ్​కు 283.9151 మార్కులొచ్చాయి.

జీవితంలో విజయం సాధించిన వారి ఆనందానికి అవధుల్లేవు. దాదాపు 11 ఏళ్లుగా కలిసి చదువుకున్న ఈ జంట ఏదైనా మాట్లాడుకోవడానికి కలిసి కూర్చున్నా.. అదో స్టడీ సెషన్​ను తలపిస్తుందని చెబుతున్నారు​.

''నా జీవితంలో ఈ క్షణం కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. ఇది సాధించడానికి దాదాపు పదేళ్లు పట్టింది. ఈ గెలుపు అనుభూతిని మాటల్లో చెప్పలేను. ఇది నా ఒక్కని విజయం కాదు. నాకు తోడుగా నిలిచిన అమ్మ, భార్య, సహచరులు, స్నేహితులందిరి విజయమిది. అందుకే ఈ సమష్టి విజయంతో నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా.''

- అనుభవ్​ సింగ్​

విభాసింగ్​.. గత ఏడేళ్లుగా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్​ డెవలప్​మెంట్​ ఆఫీసర్​(ఏడీఓ)గా పనిచేస్తున్నారు. ఇంట్లో పని, ఉద్యోగం చేసుకుంటూనే భర్తతో కలిసి పరీక్షలు రాశారు.

''మేం ఇద్దరమూ ఎంపికవుతామని నాకు తెలుసు. కానీ.. టాప్​లో నిలుస్తామని ఊహించలేదు. ఈ సంతోషాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నా. 2012లో పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖలో అసిస్టెంట్​ డెవలప్​మెంట్​ ఆఫీసర్​గా ఎంపికయ్యా.''

- విభా సింగ్​, అనుభవ్​ భార్య

Last Updated : Jul 27, 2019, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details